నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్‌గా పాటిస్తూ జిల్లా కోర్టు ఆవరణంలోని అసోసియేషన్ హాల్లో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని నేటి యువత ఆయన స్ఫూర్తితో ముందుకు …
Read More »Monthly Archives: January 2023
ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతి ని మండలంలోని సాటాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు మీడియం పాఠశాలలో జనాభాయ్ రవికుమార్ దంపతులు తన కుమారుడు సాయి విశ్వాస్ ఇదే రోజు జన్మించడం అదృష్టమని ఈ సందర్భంగా 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు, భవిత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల పిల్లలకు నోట్ బుక్స్, పలకలను ప్రధానోపాధ్యాయులు …
Read More »విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించడానికి పరీక్ష పే చర్చ
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బోధన్ నియోజకవర్గ భాజపా సినియర్ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల్లో …
Read More »క్రీడా పోటీలు ప్రారంభం
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ ఎస్‌ఎంసి చైర్మన్ ఎం నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బలరాం, నాయకులు రఫిక్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, ఉపాధ్యాయులు చిన్నప్ప, సంతోష్, …
Read More »పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్ ఉస్మాన్ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …
Read More »ఉత్తమ అధికారుల వివరాలు అందజేయాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని …
Read More »ప్రజావాణికి 79 ఫిర్యాదులు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు డీఆర్డీఓ …
Read More »తెలంగాణ పదానికి మారుపేరు ‘టీఎన్‌జీఓ’ లు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పదానికి టీఎన్‌జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీఎన్‌జీఓల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ లను …
Read More »నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు…
బీర్కూర్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతు స్వాతంత్య్ర సమరయోధులు దేశ భక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటాన్ని విద్యార్థులకు, యువతకు తెలియజేస్తూ మరింత ముందుకు వెళతామన్నారు. …
Read More »హిందువుల ఉపవాసాలపై పరిశోధనలు జరుగుతున్నాయి
ఎడపల్లి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతీ ఒకరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని హిందూ సంస్కృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా చర్చించుకొంటున్నారని, ప్రపంచంలోని పెద్ద పెద్ద మేధావులందరూ హిందూ సంస్కృతిపై అవగాహన పెంచుకుంటున్నారని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. ఆదివారం ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసారు. ఈ సందర్భంగా హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి …
Read More »