నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుద పోరాట యోదురాలు చాకలి ఐలమ్మ స్త్రీ సమాజానికి ఆదర్శమని దర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళికా సంఘ సభ్యులు, ధర్పల్లి జడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడారు.
తెలంగాణ సాయుద పోరాటంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ భావితరాలకు ఆదర్శంగా నిలించిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో వెలువడిన పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ సాయుద పోరాట వీరుల చరిత్రలు ఎక్కడ కనిపించవని, కేవలం ఆంధ్రలో ఉన్న వారిని గొప్పగా చూపిస్తూ వారి చరిత్రలన తెరకెక్కించే ప్రయత్నం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని, ఉద్యమ నాయకుడిగా మన ముఖ్యమంత్రి కేసిఆర్ పోరాట పటిమ, తెలంగాణ ప్రజల సహకారంతో నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన వారి జీవిత చరిత్రలను మన పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి తెలంగాణ సమాజానికి తెలియజేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు మన పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ కోసం పోరాడిన సాయుద యోధులు, తెలంగాణ సాధనలో అసువులు బాసిన వారి జీవిత చరిత్రలను చదివి తెలుసుకునే అవకాశం నేడు లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుకుంటారని, అదే విధంగా తెలంగాణ సమాజం అభివృద్ది దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ఉద్బోదిస్దారని పేర్కొన్నారు.
సమాజ హితాన్ని పక్కన పెడితే ప్రశ్నించే వారిలో చాకలి ఐలమ్మ ఆత్మ ప్రవేశించి ఎదురు తిరిగేలా చేస్తుందని అన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహ దాత రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని, ఆయన గురించి నియోజకవర్గంలో తెలియని వారు అంటూ ఎవరు ఉండరని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, స్థానిక జడ్పిటిసి దాసరి ఇంద్ర లక్ష్మీ నరసయ్య, మండల బిఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణ, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చక్కరి కొండ కృష్ణ, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మండల బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.