కామారెడ్డి, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కేంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి చేయూతనిచ్చే కేటాయింపులను చేయడం అభినందనీయమని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుతే ఈసారి విద్యా రంగానికి నిధుల కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలో 38 వేల ఉపాధ్యాయుల నియామకం,740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, జాతీయ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, యువతకు నైపుణ్యాలను పెంపొందించడం కోసం ఏర్పాట్లు,వైద్య విద్య కోర్సుల్లో మల్టీ డిస్ప్లేనరి కోర్సులు, ఉపాధ్యాయ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అనుకూలమైన అంశాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయని అన్నారు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 40 వేల కోట్లకు పైగా రూపాయలను అదనంగా విద్యారంగానికి కేటాయించడం స్వాగతించాల్సిన విషయమని అన్నారు.