ఆర్మూర్, ఫిబ్రవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆర్మూర్ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చే డయాలసిస్ పూర్తి స్థాయి సేవలు ప్రారంభించబడ్డాయని, కావున కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో కోరారు.
అలాగే ఇంతకుముందు ఎవరైతే నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలలో డయాలసిస్ చేయించుకున్నవాళ్లు అక్కడినుండి నో ఆబ్జెక్షన్ పత్రం తీసుకువస్తే ఏరియా ఆసుపత్రి ఆర్మూర్లో డయాలసిస్ సేవలు పొందవచ్చు అని పేర్కొన్నారు.