Daily Archives: February 3, 2023

ఎడపల్లిలో వివాహిత ఆత్మహత్య

ఎడపల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్య కారణాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన దేరేడి అనసూయ (55) అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు …

Read More »

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల గ్రామ శివారులోని పసుపు వాగులో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు రేంజల్‌ ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులోని పసుపు వాగులో నీటిపై తేలే ఆడుతున్న మృతదేహం కనబడడంతో గ్రామస్తులు సమాచారం అందించారని గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయట …

Read More »

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు అభ్యర్థుల ఎంపికలలో నిరుపేద దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిరచారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద దళిత కుటుంబాలకు మొదటగా ప్రాధాన్యతగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు ప్రక్రియలో …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ఉషా ముల్లపూడి గుండే వైద్యశాలలో శుక్రవారం చత్తీస్‌ గడ్‌ రాష్ట్రానికి చెందిన అజింతా సాహూ (48) కి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌ఓ దొమ్మాటి శ్రీధర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

ఈనెల 13 నుండి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ బి.ఏ., బి.కాం, బి.ఎస్‌సి, బిబిఏ (సిబిసిఎస్‌) మొదటి సంవత్సరం, 1వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 13వ తేదీ ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్సమినేషన్‌ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సంప్రదించాలన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »