కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాదులోని ఉషా ముల్లపూడి గుండే వైద్యశాలలో శుక్రవారం చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన అజింతా సాహూ (48) కి గుండె ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌ఓ దొమ్మాటి శ్రీధర్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
రక్తదానం చేసిన రక్తదాత దుమ్మాటి శ్రీధర్ కు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలు తెలిపారు. ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం గత 6 నెలలలోనే 408 యూనిట్ల రక్తాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికోసం, అనీమియా వ్యాధితో బాధపడుతున్న గర్భిణీ స్త్రీల కోసం, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి కావలసిన ప్లేట్ లేట్స్‌ను ఎల్లవేళలా అందజేయడం జరుగుతుందన్నారు.
సమాజంలో డబ్బు చాలామంది దగ్గర ఉంటుందని సమాజసేవ చేయాలనే ఆశయం చాలా కొద్దిమంది వ్యక్తుల్లో మాత్రమే ఉంటుందని అలాంటి సామాజిక సేవా తత్పరుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అని, వారి నేతృత్వంలో పేద ఆడపిల్లల వివాహాలకు పుస్తె మట్టలను, పేద విద్యార్థులకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఐవీఎఫ్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు 9492874006 నెంబర్ కు సంప్రదించినట్లతే కావాల్సిన రక్తాన్ని అందజేస్తామన్నారు.