ఎడపల్లిలో వివాహిత ఆత్మహత్య

ఎడపల్లి, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్య కారణాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన దేరేడి అనసూయ (55) అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిరదని ఎస్సై పాండేరావు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుకి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. శవాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »