ప్రతి శక్తి కేంద్రం స్థాయిలో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ అధ్యక్షతన రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్‌ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కి కూడా సముచిత నిధులు కేటాయించారని అన్నారు. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 10 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 11 వేళ స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో కూడా దాదాపు వంద స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. బూత్‌ స్థాయిలో పార్టీ పటిష్టత ఎంత ఉంటే, జనాలతో పార్టీ కార్యకర్తలు కలిసిమెలిసి ఉంటే అంత మంచిదని అన్నారు. నరేంద్ర మోదీ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »