బాన్సువాడ, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండలంలోని పెద్దదేవడ గ్రామానికి చెందిన నర్సవ్వ ప్రసవానికి శుక్రవారం బాన్సువాడ మాత సంరక్షణ ఆసుపత్రికి రావడంతో వైద్యులు తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అంబులెన్స్ సిబ్బంది శివకుమార్ తగిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖ ప్రసాదం చేయడంతో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో నరసవ్వ బంధువులు టి.ఎం.పి శివకుమార్ పైలెట్ శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి మెరుగైన చికిత్స నిమిత్తం నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.