బాన్సువాడ, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, మాత శిశు ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ తదితర కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, జీవో 60 ప్రకారం 15 వేల 600 రూపాయలు చెల్లించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్‌కు శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ వీరభద్ర ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ కాంట్రాక్టర్ కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, బకాయి వేతనాలు జీవో 60 ప్రకారం 15 వేల 600 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వేతనం నుండి పీఎఫ్ వాటా 3023 రూపాయలు, ఈఎస్‌ఐ వాట 484 రూపాయలు కట్ చేసుకోని మిగతా అమౌంటు 12 వేల 93రూపాయలు కార్మికుని ఖాతాలో జమ చేయాలని, పీఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, సెల్ఫోన్ మెసేజ్‌కు అనుసంధానం చేయాలని, రెండు జతల యూనిఫామ్‌లు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని ఆయన తెలిపారు.
అలాగే గతంలో పనిచేసిన సాయి సర్వీసెస్ సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ఎంసిహెచ్ హాస్పిటల్లో పనిచేసిన కార్మికులకు పీఎఫ్ డబ్బులు జమ చేయలేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి ఏజెన్సీ యొక్క డిపాజిట్‌ను ఇతర బిల్లులను నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీ మిత్ర ఏజెన్సీ కింద పని చేస్తున్న సెక్యూరిటీ, కాంటిన్ జెన్, డిఈఓలకు వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంతోష్ గౌడ్, సురేందర్, సాయిలు, గంగాధర్, సంతోష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.