బీర్కూర్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం బీర్కూరు మండలంలోని దామరంచ, అన్నారం, చించోలి,కిష్టాపూర్, బీర్కూర్ గ్రామాలలో హత్ సే హత్ జోడో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడోయాత్రకు అనుసంధానంగా వారి సందేశాన్ని గ్రామ గ్రామాన ప్రతి గడపగడపకు చేరవేయాలని ఉద్దేశంతో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో, దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గడపగడపకు విచ్చేసి వారి వైఫల్యాలను ఎండగడతామని, రానున్న ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ గడ్డపై పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకులు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.