నిజామాబాద్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మగ్దూం మొయినుద్దీన్ పోరాటమటిమ ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ కొనియాడారు. మొయినుద్దీన్ ఆశయాల కనుగుణంగా ప్రజా ఉద్యమ నిర్మాణమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ మగ్దుమ్ మొహియూద్దీన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ 4 ఫిబ్రవరి 1908 ఆందోల్, మెదక్ జిల్లాలో కామ్రేడ్ మహిముద్దీన్ జన్మించారని,1939 సంవత్సరంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ సమావేశాలకు హాజరై హైదరాబాద్లో ఏఐఎస్‌ఎఫ్ సంఘాన్ని, అభ్యుదయ సంఘాన్ని, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించారని వెల్లడిరచారు. నాటి నైజాం కాలంలో హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర వహించారని తెలిపారు.
నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి పిలుపునిచ్చిన దాంట్లో మొదటి వ్యక్తి కామ్రేడ్ మగ్దూం మహియూద్దీన్ అని గుర్తు చేశారు. 1969 ఉర్దూ కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారని, హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికై సిపిఐ శాసనసభాపక్ష ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజా సమస్యలపై గొంతెత్తిన నాయకుడని అన్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మగ్దూం మోహినుద్దీన్ విగ్రహం ఏర్పాటు, సిపిఐ రాష్ట్ర కార్యాలయం భవనానికి మగ్దూమ్ భవన్‌గా నామకరణం చేయడమంటే ఆయన పోరాట గొప్పదనం తెలుసుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు రఫిక్ ఖాన్, రఘురాం, ప్రకాష్ పాల్గొన్నారు.