కామారెడ్డి, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్ అలీ ఫౌండేషన్, సహాయత ట్రస్ట్ ఇండో యుఎస్ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడారు.
కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు పేద ప్రజలు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉచితంగా ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు, కంటి లెన్స్, చిన్నపిల్లలకు సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు. 15 వందల మందికి పరీక్షలు అందించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేశామని వివరించారు. దీనితోపాటు అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశార.
శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారిని హైదరాబాద్ తరలించి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించి వారికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, అమెరికాకు చెందిన డాక్టర్ మంజూరుగౌరీ, అనీస్ ఒద్దిన్, ఇఫ్తాఖరుద్దీన్, వలి మొహమ్మద్, డాక్టర్ సీమ, డాక్టర్ రఫియా మతిన్, డాక్టర్ ఆశ, డాక్టర్ ముస్కాన్, డాక్టర్ సుమయ్య, డాక్టర్ అమరిన్, డాక్టర్ అమృత, సయ్యద్ జాఫర్, షహబాజ్, డాక్టర్ ఫరీదా, డాక్టర్ మొహమ్మద్ ఆర్షద్, డాక్టర్ సభియా, డాక్టర్ గపూర్, డాక్టర్ ఉబెద్, చంద్రకాంత్ రెడ్డి, లింగారెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, పాక జ్ఞానేశ్వరి, రవి ప్రసాద్, మక్సుధ్, సందీప్, సాజిత్, నయీం, సయ్యద్ ఏజాజ్, షేరు, అతీక్, అశ్రార్ తదితరులు పాల్గొన్నారు.