ఎడపల్లి, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన ఎరువల్లి గంగాధర్ (40) గత కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 1న రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని పోలీసులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం జమ్లం గ్రామ శివారులోని చెరువులో లో శవం తేలిఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని తీసి మృతుడు జమ్లం గ్రామానికి చెందిన గంగాధర్ గా గుర్తించారు.
పోస్టుమార్టం నిమిత్తం బోధన్ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగాఅప్పుల బాధతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని అన్నారు. మృతుని భార్య కవిత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండేరావు తెలిపారు.