నిజామాబాద్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ అధికార సేవా సంస్థలో చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ డిప్యూటీ లీగల్ ఎయిర్ కౌన్సిల్ ఉదయ్ కృష్ణ, అసిస్టెంట్ లీగల్ లేడు కౌన్సిల్‌గా గంగోని శుభం ప్రమోద్ నియామకమై బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం జిల్లా కార్యాలయంలో న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశం మేరకు పౌరులందరికీ ఉచిత న్యాయ సేవ అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, అడ్వకేట్ సొసైటీ చైర్మన్ వసంతరావు, న్యాయవాదులు బిట్ల రవి, కేశవరావు, నారాయణదాసు, జయప్రకాష్, లోయ ఎల్లానంద్ గుప్తా, పిల్లి శ్రీకాంత్చ, పులి జైపాల్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.