ప్రభుత్వ తీరును ఎండగట్టెందుకే హాత్‌ సే హాత్‌ జోడు యాత్ర

రెంజల్‌, ఫిబ్రవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీపీ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్‌ సే హత్‌ హాజో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆదివారం నాందేడ్‌లో నిర్వహించిన బిఆర్‌ఎస్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ బాబ్లీ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మిస్తే నేటి ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తుందన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా బాబ్లీ ప్రాజెక్టుకు ఎలా నీటిని సప్లై చేస్తారో సీఎం కేసీఆర్‌ తెలపాలని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేసారని, దళిత బంధు పేరుతో అర్హులైన దళితులకు ఇవ్వకుండా బిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అందజేయడం జరుగుతుందని అలా కాకుండా అర్హులైన దళిత కుటుంబాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సిహెచ్‌ రాములు, శంకర్‌ గౌడ్‌, సురేంధర్‌ గౌడ్‌, సాయిబాబా గౌడ్‌, ఎంఎల్‌ రాజు, పోచయ్య,ఆమ్రద్‌ శేఖర్‌, లోక కృష్ణ, సిద్ద సాయిలు, శంషోద్దీన్‌, రాకేష్‌, సద్దాం తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »