రెంజల్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో సోమవారం సర్పంచ్ వికార్ పాషా, ఎంపీటీసీ అహ్మద్ సిసి డ్రైనేజీ పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధుల ద్వారా మంజూరైన రూ.5 లక్షలతో పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ లతా సాయిలు, వార్డు సభ్యులు కంఠం గంగారాం, సురేష్, పోసాని, బిఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్ల భూమేష్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ చంద్రశేఖర్, నాయకులు బుడ్డొల్ల సాయిలు, సాదిక్ బేగ్, ప్రశాంత్, జలీల్, గంగాధర్, నరేష్ తదితరులు ఉన్నారు.