ఆర్మూర్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య ఉపకేంద్రం ఆలూర్ ఆధ్వర్యంలో సోమవారం స్పర్శ లెప్రసీ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్ మాట్లాడుతూ 30 జనవరి 2023 నుండి 13 ఫిబ్రవరి 2023 వరకు లెప్రసీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి నిర్ధారణ చేసి వారికి తగు మందులను ఇవ్వబడుతుందని తెలిపారు.
లెప్రసి వ్యాధిని గుర్తించడానికి ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటాయని పేర్కొన్నారు.
- శరీరంపై పాలిపోయిన తెలుపు లేదా రాగి రంగులో పూర్తిగా స్పర్శ కోల్పోయిన మచ్చలు.
- నరములలో నొప్పి, నరములు లావు కావడం.
- చేతులు, పాదాలు స్పర్శ కోల్పోవడం, శరీరంపై నిగారింపు చిన్న చిన్న కంతులు రావడము.
- సకాలములో ఈ వ్యాధిని గర్తించినట్లయితే అంగవైక్యమును నివారించవచ్చును.
కార్యక్రమంలో ఎంపీపీ, ఎంఆర్‌ఓ, ఎంపిడిఓ, పిహెచ్‌సి వైద్యాధికారిణి పూజారెడ్డి, ఆరోగ్య కార్యకర్త గిరిజ, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.