కామారెడ్డి, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన కమిటీ 2023-26 కొరకు గత నెల జనవరి 31 నాడు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. దాదాపు 23 నామినేషన్లు వస్తే పద్మశాలి యువజన సంఘ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకొని సహకరించి యువజన సంఘ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా ఐరేని సందీప్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా చెలిమల భాను ప్రసాద్, ఇప్పకాయల రాజు అధ్యక్షుడిగా పొలాస సురేష్, ప్రధాన కార్యదర్శిగా సామల నాగ శ్రీను, కోశాధికారిగా సబ్బని మదన్, ఉపాధ్యక్షులుగా చాట్ల వేణు, జడల రజినీకాంత్, గాజుల నరేష్, బొమ్మెర సాయినాథ్, బొమ్మెర వేణు గోపాల్, సహాయ కార్యదర్శిగా గొరిటాల ప్రకాష్, ఎలిగేటి భాను ప్రసాద్, చిటిమెల అరవింద్, రేగొండ విజయ్, మ్యాకల రాకేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం సోమవారం నియామక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నికకు సహకరించిన యువజన సంఘం సభ్యులకు మాతృ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల కమిటీ కో కన్వీనర్ గర్దాస్ గోవర్ధన్, రఘు, పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు చాట్ల రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి తుమ్మ రమేష్, జిల్లా సెక్రెటరీ బొమ్మల రాజయ్య, పడిగే శ్రీనివాస్, చౌకి లక్ష్మీ నరసింహులు తదితరులున్నారు.