నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో అన్ని హంగులతో రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనానికి మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. వృద్ధాశ్రమం ఆవరణలో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు.
వృద్ధాశ్రమంలోని వివిధ విభాగాలను సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజీ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ధర్పల్లి జడ్పిటీసి బాజిరెడ్డి జగన్, డిచ్పల్లి జడ్పిటిసి ఇందిర, డీడబ్ల్యుఓ సుధారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ గోపి తదితరులు పాల్గొన్నారు.