బోర్‌వెల్‌ డీ, వ్యక్తి మృతి

మాక్లూర్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం బొంకన్‌ పల్లి గ్రామంలో బోర్‌వెల్‌ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం బొంకన్‌ పల్లి గ్రామవాసి సుధాకర్‌ తన నూతన ఇల్లు నిర్మాణంలో భాగంగా నీటి అవసర నిమిత్తం బోరు వేసే దశలో డ్రైవర్‌ తప్పిదంతో రివర్స్‌ చేసే సమయంలో వేగంగా రావడంతో ఛత్తీస్‌గడ్‌కు చెందిన వర్కర్‌ సముర్‌ సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

డ్రైవర్‌ సురేందర్‌ అతివేగంగా నడపటంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బోర్వెల్‌ యజమాని రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్‌ తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »