కామారెడ్డి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 లోగా రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ బియ్యంను అందజేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లతో ఖరీఫ్ (వానకాలం) 2021-22 సీజన్‌కు చెందిన సిఎంఆర్ బియ్యం సరఫరా గురించి రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరి ధాన్యం మిల్లింగ్ లక్ష్యాలను పూర్తి చేయని రైస్ మిల్లు యజమానులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, రైస్ మిల్లులు యజమానులు పాల్గొన్నారు.