బాలికల భవితకు భరోసా సుకన్య పథకం..

బాన్సువాడ, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయ ఆవరణలో సబ్‌ డివిజనల్‌ తపాలా శాఖ ఇన్స్‌పెక్టర్‌ వేణు సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క విశిష్టతను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో ఈనెల 9, 10 తేదీలలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, సుకన్య ఖాతాలు ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. గడపగడపకు సుకన్య పథకాన్ని తీసుకువెళ్లి ఖాతాలను ప్రారంభించే విధంగా చూడాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎం కృష్ణ చైతన్య, మోయిన్‌, రూపేష్‌, సాయినాథ్‌, సాయిలు, రవీందర్‌, రాకేష్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »