కామారెడ్డి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను బుధవారం టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను కల్పించినందుకు, ఈ విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ జువాలజీ కోర్సును ప్రారంభించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను, మౌలిక వసతులను కల్పించడం సంతోషదాయకమన్నారు.
దక్షిణ ప్రాంగణ అభివృద్ధికి ఎంతగానో సహకరించడం సంతోషదాయకమని, రానున్న విద్యా సంవత్సరానికి గాను మరిన్ని కోర్సులను దక్షిణ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ముగిళ్ళపల్లి భూమేష్ గుప్తా పాల్గొన్నారు.