కామారెడ్డి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థులకు మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు.
నర్సింగరావు మొదట మండలంలోని 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 410 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. నియోజకవర్గంలోని 66 బడుల్లో 2,065 మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులకు హామీ ఇచ్చారు.