కామారెడ్డి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 2022 త్రైమాసికానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక రూ.4700 కోట్లు, ఇప్పటివరకు రూ.3023 కోట్లు (64.32 శాతం) రుణ వితరణ సాధించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కెనరా బ్యాంక్, జిల్లా లీడ్ ఆఫీస్ ఆధ్వర్యంలో రుణాల వితరణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పంట రుణాలు రూ.1434 కోట్ల లక్ష్యం ఉందన్నారు. ఇప్పటివరకు పంట రుణాలు రూ.544 కోట్లు (63.38 శాతం) పంపిణీ చేసినట్లు తెలిపారు. పారిశ్రామిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల పెండిరగ్ రుణాలు తక్షణమే ఋణ వితరణ చేయాలని పేర్కొన్నారు. నా బర్డ్ కింద సదాశివ్ నగర్, లింగంపేట మండల సమైక్యలకు చేపల పెంపకం యూనిట్ల కోసం రూ.10 లక్షల చొప్పున రుణాల పత్రాలను మహిళా సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ శ్రీనివాసరావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి అలీ బాబా, నాబార్డ్ డీడీఎం నగేష్, ఎల్డిఎం చిందం రమేష్, డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులు భాగ్యలక్ష్మి, డాక్టర్ భరత్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, డీపీఎంలు రమేష్ బాబు, రవీందర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.