కామారెడ్డి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అవరణలో రైతుబంధు సమితి కాలమనిని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ నర్సింలుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని రాజుగా చేసే వినూత్న ప్రక్రియ తమ భుజాలపై ఎత్తుకొని రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం, రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రైతుభీమా పధకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు భుజంపై చేయివేసి వెన్నుతడుతున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
దేశంలోనే రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందనీ రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా రైతువేదిక లు నిర్మించారని కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ రేవతీ శ్రీనివాస్, ఎంపిటిసి లక్ష్మారెడ్డి, ఆర్‌ఐ అజయ్, ఉపసర్పంచ్ బాపురెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఏఈఓ సాగర్, బిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి, వార్డ్ సభ్యులు రాజమల్లయ్య, రాజిరెడ్డి, రైబస సభ్యులు, బీఆర్‌ఎస్ శ్రేణులు గంగారాం, రవి, శ్రీధర్ రెడ్డి, దేవరాజ్, లింగరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.