రెంజల్, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన బోయి విజయ నిరుపేద కుటుంబం కావడంతో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా సర్పంచ్ వికార్ రూ. 5 వేల 100 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సర్పంచ్ వికార్ పాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించడంలో ఎప్పుడు ముందుండే సర్పంచ్ వికార్ పాషా సేవలను గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో భూమేష్, ప్రసాద్, నరేష్, సాయిలు, పోశెట్టి తదితరులు ఉన్నారు.