కార్పొరేషన్‌ అధికారులకు భద్రత లేదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వంటి అధికారులు నిబద్ధతతో పని చేస్తుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు, మేయర్‌ భర్త, టిఆర్‌ఎస్‌ నాయకులు అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఇదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు.

శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందుగలదు అందులేదనే సందేహం లేదు, ఎక్కడెక్కడ చూసినా కబ్జాల పర్వం టిఆర్‌ఎస్‌ నాయకులదని ఆయన అన్నారు. భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు లభించినా ప్రభుత్వ గ్రాంట్లు తెచ్చుకోకుండా నిజామాబాద్‌ మున్సిపాలిటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చినటువంటి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేటికీ పూర్తికాని పరిస్థితి నగరంలో ఉందని అన్నారు.

నగరంలో ట్యాంకుబండ్‌ నిర్మాణం అని చెప్పి రఘునాథ చెరువుకి 6కోట్ల వ్యయంతో మొదలుపెట్టి ప్రస్తుతం 36 కోట్లకు వెళ్లిందని అందిన కాడికి నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ బిఆర్‌ఎస్‌ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన విమర్శించారు. అధికారం ఉంది కదా అని తిన్న ప్రతి పైసా కక్కిస్తామని స్పష్టం చేశారు. అధికారం మారనుంది, తిన్న ప్రతి పైసా వసూలు చేస్తామన్నారు.

జైల్లో కూర్చోవాల్సినటువంటి మీరు కుర్చీల్లో కూర్చోవడం వల్ల నిబద్ధతతో పనిచేసే అధికారులను ట్రాన్స్ఫర్‌ ల పేరుతో ఇబ్బందులు పాల్‌ చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది, రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్తారని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంను హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్‌, అర్బన్‌ అసెంబ్లీ కో కన్వీనర్‌ నారాయణ యాదవ్‌, జిల్లా నాయకులు యెండల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »