ఆర్మూర్, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం విజయ్ హై స్కూల్‌లో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 41వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు.
క్రీడల ద్వారా మానసిక శారీరక అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులు ఈ టోర్నమెంట్‌తో పండుగ వాతావరణాన్ని ఏర్పరచారని అన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి అట్టహాసంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు మానస గణేష్ మాట్లాడుతూ క్రీడలు ఉన్నత విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడాకారులకు వసతి కల్పించిన విజయ్ హైస్కూల్ పాఠశాలలకు అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ నివేదిక సమర్పించారు. కార్యక్రమానికి ముందుగా జిల్లా, రాష్ట్ర క్రీడా పతాకాలను ఆవిష్కరించి క్రీడాకారుల చేత అతిథులు గౌరవం వందనం స్వీకరించి ముఖ్యఅతిథి క్రీడలను ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుండి బాలుర జట్లు 9, ఉమ్మడి జిల్లాల నుండి 9 బాలికల జట్లు పాల్గొన్నట్లు ప్రధాన కార్యదర్శి శ్యాం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి ముత్తన్న, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి మల్లేష్ గౌడ్, బాల్ బ్యాట్మెంటన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు వీరభద్రరావు, జాయింట్ సెక్రటరీ దుర్గయ్య బయన్న, జిల్లా కోశాధికారి రాజేశ్వర్, కృష్ణమూర్తి, జిల్లా సంఘం బాధ్యులు సురేందర్, నాగేష్ సురేష్, మాధురి, భాగ్య వినోద్, రాజేష్, వ్యాయమా ఉపాధ్యాయులు రమణ, సంతోష్ ఠాగూర్, చిన్నయ్య భాగ్య, మధు, భూపతి, రాజేందర్, రాజేశ్వర్, నిఖిత, నరేంద్ర, నాగేష ధరంపురి, సురేష్ పాల్గొన్నారు.