45వ డివిజన్‌లో శక్తి కేంద్ర సమావేశం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్‌ మీటింగ్‌లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ పట్టణం 45 వ డివిజన్‌ శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి ఆర్మూర్‌ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే భూత్‌ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించాలని బిజెపి రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రంలోని 11 వేల శక్తి కేంద్రాలలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ చైతన్య పరచడమే లక్ష్యంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసిందన్నారు. కార్యకమ్రంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »