నిజామాబాద్, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు వీలుగా భారత రిజర్వ్ బ్యాంకు రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమావారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, సరైన ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించడం సురక్షితం, ఎంతో శ్రేయస్కరం అని ప్రజల్లో అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఆర్బీఐ ఈ నెల 13 నుండి 17 వ తేదీ వరకు ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తోందని అన్నారు.
పొదుపు, సరైన ఆర్ధిక ప్రణాళిక, బడ్జెట్ రూపొందించుకోవడం, డిజిటల్ లావాదేవీల వల్ల సమకూరే లాభాలు తదితర అంశాల గురించి వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ నారాయణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.