కామారెడ్డి, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం సెట్టింగ్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి మహోత్సవం శనివారం వచ్చే శివరాత్రి రోజు కూడా నాలుగవ సారి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నిర్వహించనున్నామని అన్నారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం 7 గంటల నుండి పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అన్నారు. కావున నియోజకవర్గ పరిధిలోని శివ భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలనీ విజ్ఞప్తి చేశారు.