ఉత్సాహంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్‌ స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ – 2023 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభ కార్యాక్రమం జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంత్‌, పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు.

ముందుగా జిల్లా కలెక్టర్‌ పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ చేసి, జ్యోతిప్రజ్వలన అనంతరం ఆన్వల్‌ స్పోర్ట్స్‌ మరియు గేమ్స్‌ మీట్‌ 2023 ను ప్రారంబించారు. నవాతే శ్రీనివాస్‌ ఒలంపిక్‌ కాగడ చేబూని క్రీడాజ్యోతిని తీసుకొని పరేడ్‌ గ్రౌండ్‌ చుట్టు రన్‌ చేశారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రం శాంతి భద్రతతో ఉందంటే అది పోలీసుల విధి నిర్వాహణ అని, యునిఫామ్‌ సర్వీస్‌లో ఉన్నటువంటి వారు 24/7 విధినిర్వహణలో ఉంటారని, ఇతర శాఖల వారికి అన్ని రకాల సెలవు దినాలు ఉంటాయని, అన్ని రకాల పండుగలు ఉంటాయని, పోలీస్‌ సిబ్బందికి ఎలాంటి సెలవులు, పండుగలు ఉండవని, వారు ఎల్ల ప్పుడు విధినిర్వహణలో ఉంటారని, అలాంటి నిర్విరామ విధులలో ఉన్న పోలీసులకు ఈ ఆన్వాల్‌ స్పోర్ట్స్‌ మరియు గేమ్స్‌ మీట్‌-2023 అనేది ఉత్సాహాంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తుందని, సిబ్బందికి ఎల్లప్పుడు పని వత్తిడితో తట్టుకోవడానికి ఎల్లప్పుడు వారికి అన్ని రకాల బలాన్ని కలిగించడానికి, శక్తిని ఇవ్వడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని, ఈ క్రీడల వల్ల వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఒక చక్కని బంధం ఏర్పడుతుందని అన్నారు.

ఈ క్రీడలు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని, గెలుపోటములను ఏదైనా స్పూర్తిగా తీసుకోవాలని, అందరూ కట్టుబడి మీ ఆటలు జరగాలని తెలిపారు. క్రీడా కారులు జిల్లాస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా మంచిగా రాణించాలని కోరారు.

ఈ సందర్భంగా పోలీస్‌ కమీషనర్‌ మాట్లాడుతూ గతకొన్ని సంవత్సరాలుగా కోవిడ్‌ ఉండటంతో క్రీడలు నిర్వహించలేకపోయామని, మళ్లీ సాధారణ వాతావరణం ఉన్నందున క్రీడలు నిర్వహిస్తున్నామని, మన పోలీస్‌ విభాగంలో విధినిర్వహణలో క్రీడలు అనేవి ఎంతో అవసరమైనవని, మనం అందరం ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుంది అని, శారీరకంగాకాని, ఈ క్రీడలు అంటేనే ఒక పండుగ వాతావరణం అని, సిబ్బంది 24/7 విదులు నిర్వహించడం వలన తమ ఆరోగ్య బాగోగులు గురించి మరచి పోతుంటారని, ఈ క్రీడల వలన ఆరోగ్యం ఉత్సాహాంగా ఉంటుందని, సిబ్బందికి ఈ మద్య స్ట్రెస్‌ మేనేజ్మెంట్‌ అనేది వచ్చిందని, వారం చివరలో ఉల్లాసంగా గడపడానికి తోడ్పడుతుందని, వలని వత్తిడి ఎక్కువవుతుందని, ఎన్ని చాలేంజీలు వచ్చిన కూడా సిబ్బంది ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, ఈ క్రీడలు 3 రోజులు నిర్వహిస్తున్నామని, కాని ఇక్కడ క్రీడలలో ఓడిన గెలిచిన పండుగ వాతావరణం మాత్రమే ఉంటుంది, సిబ్బంది ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండాలని అదే ఈ క్రీడల యొక్క గొప్పదనం అన్నారు.

సిబ్బంది నైపుణ్యంను వెలికితీయుటకు ప్రతీ సంవత్సరం జిల్లా స్థాయిలో స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ కార్యక్రమం నిర్వహిస్తు అందులో భాగంగానే నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ ఆన్వల్‌ స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ 2023 ప్రారంభించామని అన్నారు.

పోటీలు మూడు రోజుల పాటు నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌లు, ఆర్ముడ్‌ రిజర్వు, హోమ్‌ గార్డ్సు విభాగం, అలైడ్‌ బ్రాంచ్లు, పోలీస్‌ కార్యాలయం సిబ్బంది జట్ల మధ్య వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, కబడీ, హై జంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌, డిస్కస్‌ త్రో, జవలిన్‌ మరియు అథెలిటిక్స్‌ క్రీడలు జరుగుతాయన్నారు. అన్ని ఆటలను అందరు చక్కగా సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు.

కార్యక్రమంలో అదనపు కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ గిరిరాజు, నిజామాబాద్‌, ఆర్మూర్‌, ట్రాఫిక్‌, ఎర్‌, ఆర్‌, హోమ్‌ గార్డ్సు ఎ.సి.పిలు కిరణ్‌ కుమార్‌, ప్రభాకర్రావ్‌, నారాయణ, సంతోష్‌ కు మార్‌, శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్పెక్టర్స్‌ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్స్‌ అనిల్‌ కుమార్‌, శెలేందర్‌, శేఖర్‌, పెద్దన్న కుమార్‌, ఆర్‌.ఎస్‌.ఐ లు, పి.ఇ.టిలు, సిబ్బంది హాజరయ్యారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »