రెంజల్, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని రెంజల్ మండలంలోని నీలా, బాగేపల్లి గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు.
గ్రామాల్లో నేరుగా పర్యటించి ప్రజాసమస్యలపై తెలుసుని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల హామీలు నెరవేరుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల రుణమాఫీ, నిరుద్యోగ జీవనభృతి, ఉచిత కరెంటు పథకాలలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులకు అరుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు కాంగ్రెస్ పార్టీ రైతులకు నిరుద్యోగులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని నేడు ప్రత్యేక రాష్ట్ర సాధనలో రైతులు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.
ఉచిత కరెంటు పేరుతో రైతులను మోసగించారని 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని నేడు నాలుగు గంటలు కరెంటు ఇవ్వడంతో తాగునీటి ఎద్దడి పంటల ఎండు ముఖం పట్టే విధంగా కనబడుతున్నాయని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి సాటి ఎవ్వరు లేరని తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రకాల హామీలను నెరవేర్చడంలో ముందుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, తహెర్ బిన్ హాందన్, అంతిరెడ్డి రాజారెడ్డి, మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్,సీ హెచ్ రాములు, జావిదొద్దీన్, బాబు, తదితరులు ఉన్నారు.