డిచ్‌పల్లి, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్) పరీక్ష లో 10 వేల 424 మంది విద్యార్థులకు గాను 9 వేల 585 మంది హాజరయ్యారని, 839 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ పరీక్షలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఎస్‌ఐ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు డిబార్ కాగా, శ్రీ విశ్వశాంతి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో మరొక విద్యార్థి డిబార్ అయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు.