కామారెడ్డి, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా గోస బీజేపీ భరోసాలో బాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మచారెడ్డి మండలంలోని ఏళ్ళంపెట్, వొడ్డెగూడెం, మర్రితండా, బంజేపల్లీ, నెమలి గుట్ట తండా, సర్థాపూర్ తండా, సోమారిపెట్, రత్నగిరి పల్లి, గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం ఇస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదలు డబల్ బెడ్ రూం ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన ఇళ్లను కూడా పంపిణీ చేయడం చేతకావట్లేదని అన్నారు. అధికారంలోకి రాగానే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని అన్నారు. డబల్ ఇంజన్ సర్కారుతో అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతాయని అన్నారు.