బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో అమర సైనికులకు నివాళి

బాన్సువాడ, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 సంవత్సరం ఫిబ్రవరి 14 న పుల్వమా వద్ద ముష్కరుల ఘాతుకానికి బలైన నలభై మంది అమర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మౌన ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాము రాథోడ్‌ మాట్లాడారు.

ఉగ్రవాదుల దొంగ దెబ్బకు బలైన అమర సైనికులకు నివాళులు అర్పించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన వుందని అన్నారు. వారి త్యాగం వృథా కాకుండా భారతదేశ యువత దేశభక్తిని అలవర్చుకొని సైనికులకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి రూప్‌ సింగ్‌, పిర్య, రమేష్‌, హారి, రవి, రామారావు, శ్రీను, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »