ఎడపల్లి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత హామీలిస్తూ ప్రజలను వంచిస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కార్నర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి, మోహన్ రెడ్డి లు మాట్లాడారు.
ఇప్పటికే ఏడేళ్ల పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి సాధించలేదన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని బూత్ కమిటీ కార్యకర్తలకు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలకు సూచించారు. నరేంద్ర మోడీ నాయకత్వం లో బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేయడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం టీఆరెస్ పార్టీ అంతర్యమేంటో తెలుస్తుందని, పేదప్రజల భూములను కోళ్లగొట్టెందుకే ధరణిని తీసుకొచ్చారని, ఎన్‌ఎస్‌ఎఫ్ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆరెస్ పార్టీ ఆంతర్యమేమిటో తెలపాలని అన్నారు.
దేశంలో రాబోయేది ముచ్చటగా మూడోసారి మోడీ సర్కారే అని రాష్ట్రంలో సైతం బీఆరెస్ సర్కార్‌పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని అది స్పష్టంగా కనబడుతుందని, రాష్ట్రంలో సైతం రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ఆశభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోహన్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, వడ్డేపల్లి సర్పంచ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, న్యావనంది గోపాల్, ఉప్పు సురేష్, సృజన్, బండారు నర్సిములు, మేక సంతోష్, వెంకటేష్, నరేందర్, రమేష్, నర్సింలు, అశోక్ పవన్ కళ్యాణ్, గంగలత తదితరులు పాల్గొన్నారు.