నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లలో మంగళవారం ఆరోగ్య మేళా నిర్వహించారు. ప్రతి నెల 14వ తారీఖున నిర్వహించే ఆరోగ్య మేళాలో భాగంగా ఈ నెలలో ఇచ్చిన నినాదం ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కండి అనే నినాదాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మేళాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం హాజరై సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతినెల 14వ తారీఖున నిర్వహించే ఆరోగ్య మేళాలో హెల్త్ వెల్నెస్ సెంటర్ కార్యక్రమాలు అమ్మ ఒడి,యోగ, జుంబా, మెడిటేషన్, ఆరోగ్య విద్య, మొదలగు కార్యక్రమాలతో పాటు టెలి కన్సల్టేషన్, జీవనశైలి వ్యాధులను పరీక్ష చేయడం, క్షయ వ్యాధి మందుల పంపిణీ, పాలియేటివ్ కేర్ సేవలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 141 హెల్త్ వెల్నెస్ సెంటర్‌లతోపాటు 40 పీహెచ్సీ, యూపీఎస్సీలలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన గృహము కలిగి ఉండి చక్కని ఆరోగ్య అలవాట్లను పాటిస్తూ చక్కని పోషకాహారము స్వచ్ఛమైన తాగునీరు స్వచ్ఛతను పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చని, ముఖ్యంగా జీవనశైలి వ్యాధులైన షుగర్‌తో పాటు క్షయ మొదలగు వ్యాధులను నివారించుతూ రక్తహీనత పోషకాలలోప వ్యాధుల్ని అరికట్టినప్పుడే ఈ సమాజం ఆరోగ్యవంతమైన సమాజంగా మారుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో దుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ శ్రీలత, గిరిరాజ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సునీత, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు , హెచ్‌ఈఓ గోవర్ధన్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.