ఆర్మూర్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్‌లోని డివిజనల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యాలయం ముందు ఆర్మూర్ డివిజన్ తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్ 82 కార్మికులు భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మంగళవారం బోజన విరామ సమయంలో సబ్ స్టేషన్ ముందు డివిజన్ వారీగా ధర్నాను చేపట్టడం జరిగిందన్నారు.
ఇద్దరు లేదా ముగ్గురు ఆపరేటర్లతో పని చేయిస్తున్నారనీ తక్షణమే నలుగురు ఆపరేటర్లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బేసిక్ పెన్ రూరల్ పర్సనల్ పే తో కలిపిన తర్వాతే ఆర్టిజన్లకు 50 శాతం పిఆర్‌సి పిట్మేంట్ ఇవ్వాలనీ కాంటాక్ట్ ఎంప్లాయిస్ సర్వీస్ బదిలీలు, కాంటాక్ట్ సర్వీస్‌ను రిటైర్మెంట్ గ్రజ్యుటీ ప్రయోజనాల కోసం కలపాలనీ, అన్ని రకాల సెలవులు ఓ అండ్ ఎమ్ స్టాప్‌కు ఇస్తున్న అవే సెలవులు ఆర్టిజన్లకు వర్తింప చేయాలనీ డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లను పలుమార్లు యాజమాన్యాలకు విన్నవించిన పెడచెవిన పెట్టారని యాజమాన్యాలు స్పందించకపోవడంతో తమ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ తమ కార్మికులపై సానుకూలంగానే ఉన్నప్పటికీ యాజమాన్యాలు సీఎం టైం ఇస్తలేడు అని అబద్ధాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు శామంతి నవిన్, సెక్రెటరి చక్కల రామకృష్ణ, ఇట్మర్ డివిజన్ అద్యక్షులు జిల్లపల్లి సురేష్, సెక్రెటరి గంటి గణేష్, వార్నింగ్ డిసిజెంట్ మెండు మోహన్, ట్రెజరర్ గణేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీలు అచ్చ మురళి, జార్ల ఆట్ల నింజాంగ్ సింతాటరీలు, అంగరి నరేష్, ముఖ్య నాయకులు కార్మికులు పాల్గొన్నారు.