బాన్సువాడ, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాటికి పోయేవరకు కలిసి ఉంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్య భర్తల మధ్య జరిగిన చిన్న పాటి గొడవ కారణంగా భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చాకలి గంగమణిని ఆమె భర్త గంగారం మంగళవారం మధ్యాహ్నం గొడ్డలితో మెడపై నరికి దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.
భర్త గంగారం మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని, భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. మంగళవారం ఈ విషయంలో భార్య భర్తల మధ్య వాగిద్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంలో భర్త గంగారం కోపంతో ఊగిపోతూ ఇంట్లో ఉన్న గొడ్డలితో గంగామణిని కిందపడేసి మెడపై ఐదు సార్లు గొడ్డలితో నరకడంతో గంగమని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. నిందితుడు గంగారంను అదుపులోకి తీసుకొని బాన్సువాడకు తరలించారు.