Daily Archives: February 15, 2023

ఇ కుబీర్‌లో పేరుకుపోయిన బిల్లులను వెంటనే విడుదల చేయాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయక ఇ కుబీర్‌ లో పేరుకు పోయిన వేలాది బిల్లులను వెంటనే విడుదల చేయాలని టిఎస్‌ యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆర్థిక శాఖ కార్యదర్శిని డిమాండ్‌ చేశారు. సప్లిమెంటరీ బిల్స్‌, పిఆర్సీ బకాయిలు, సెలవు వేతనాలు, మెడికల్‌ రీయింబర్స్‌ మెంట్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, …

Read More »

పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ తరగతి గదుల్లో ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్‌ ఉన్నత బాలుర పాఠశాల బాన్సువాడలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని ఉపాధ్యాయులు అందించారు.ఈ …

Read More »

బాధిత కుటుంబానికి అండగా

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. కాగా పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఐఆర్సిఎస్‌ జిల్లా వైస్‌ చైర్మన్‌, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు కుటుంబీకులకు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడి కొడుకు …

Read More »

ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మహిళ

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని శివారులో కూలీ పని చేస్తున్నటువంటి కహడ స్వాతి (21) అనే మహిళ ఇంటి వద్ద వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని చికిత్స పొందుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల శివారులో పాలేరు వద్ద వ్యవసాయ క్షేత్రంలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న స్వాతి, ప్రసాద్‌ దంపతులు …

Read More »

తక్షణమే పన్నులు చెల్లించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తక్షణమే పన్నులు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్‌ ఎన్‌ వాణి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా విధించడంతోపాటు అక్కడికక్కడే వాహనాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తక్షణమే పన్నులు చెల్లించని వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని తెలిపారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే …

Read More »

ఈవిఎం గోదాము పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు కామారెడ్డిలోని ఈవీఎం గోదాంను బుధవారం నోడల్‌ అధికారులు పాండిచ్చేరి డిప్యూటీ సీఈఓ బి. తిల్ల ఈవెల్‌ , తమిళనాడు డిప్యూటీ సీఈవో వి. శ్రీధర్‌ పరిశీలించారు. సీసీ కెమెరాలను పనితీరును చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా రెవెన్యూ …

Read More »

ఆశతో ఎదురొచ్చిన అవ్వ…! ఆప్యాయతను పంచిన మంత్రి

బాల్కొండ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్‌ పేట్‌ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక వృద్ధురాలు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కాన్వాయ్‌ను చూసి చేయి ఊపింది. అది గమనించిన మంత్రి తనతో ఏదో చెప్పుకోవాలని ఆ అవ్వ ప్రయత్నిస్తోందని తన కాన్వాయ్‌ ఆపి మరి ఆ అవ్వ దగ్గరికి వెళ్లి …

Read More »

మాదవ ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఎక్సైజ్‌ సూపరింటెంట్‌ రవీందర్‌ రాజు గుడుంబా, గుట్కా గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలన అంశాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ రవీందర్‌ రాజు మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలనుసారంగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్‌ మరియు డిగ్రీ …

Read More »

ఇందూరు వాసులకు మరిన్ని ఆధునిక సదుపాయాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర ప్రజలకు త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవగాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, అదనపు …

Read More »

పోడు క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు సంబంధించి దాఖలైన క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్‌, మండల పరిషత్‌ తదితర అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన పలు సమస్యలను అధికారులు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »