ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మహిళ

రెంజల్‌, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని శివారులో కూలీ పని చేస్తున్నటువంటి కహడ స్వాతి (21) అనే మహిళ ఇంటి వద్ద వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని చికిత్స పొందుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల శివారులో పాలేరు వద్ద వ్యవసాయ క్షేత్రంలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న స్వాతి, ప్రసాద్‌ దంపతులు మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి చేరుకుని వంటపని చేస్తున్న స్వాతి ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని ప్రమాదానికి గురవ్వడంతో అరుపులు కేకలు వేయడంతో భర్త ప్రసాద్‌తో పాటు ఇటుక బట్టి యజమాని ముజాహిద్‌ ఖాన్‌ గాయాలైన మహిళను తన ద్విచక్ర వాహనంలో తీసుకుని మార్గమధ్యంలో 108 అంబులెన్స్‌ ద్వారా నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగిందన్నారు. భర్త ప్రసాద్‌ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »