కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎక్సైజ్ సూపరింటెంట్ రవీందర్ రాజు గుడుంబా, గుట్కా గంజాయి, డ్రగ్స్ నిర్మూలన అంశాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరిండెంట్ రవీందర్ రాజు మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారంగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు గుడుంబా గుట్కా, గంజాయి డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాటులకు బానిసలు కావద్దని తెలిపారు. గుడుంబా గుట్కా గంజాయి, డ్రగ్స్ అలవాటు పడినవారు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు.