బోధన్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గంలోని బోధన్ మండలంలో బండర్ పల్లి, రాంపూర్, కల్దుర్కి గ్రామాలలో బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగా శంకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహర్బిన్ హమ్దాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డిచ, బోధన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడొ యాత్ర సందేశాన్ని వివరిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1200 రూపాయలు చేసిందని, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరను 110 రూపాయలు చేసిందని, 50 రూపాయలు ఉన్న డీజిల్ ధరను 100 రూపాయలు చేసిందని, ఈ విధంగా సామాన్యులపై నిత్యవసర వస్తువులపై జీఎస్టీ వేసి ధరలు పెరగడానికి మోడీ ప్రభుత్వమే కారణమని, కావున మోడి యొక్క వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అన్యాయాలతో ప్రజలను నట్టేట ముంచుతుందని, ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు రుణమాఫీ ఊసే లేదని, 57 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడంలో విఫలమయ్యారని, అదేవిధంగా రైతులకు పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందని సుదర్శన్ రెడ్డి విమర్శించారు.
తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని, 500 రూపాయలకే సిలిండర్ను ఇస్తామని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, అదేవిధంగా పోడు భూములకు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తామని సుదర్శన్ రెడ్డి ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, బోధన్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్, రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోబిన్ ఖాన్, బోధన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రవీందర్ రెడ్డి, చందూర్ జడ్పిటిసి అంబర్ సింగ్, బోధన్ మండల మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ సభ్యులు గణపతి రెడ్డి, ఎక్స్ జెడ్పిటిసి అల్లె రమేష్, బోధన్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, సాలూర క్యాంప్ సర్పంచ్ శ్రీనివాసరావు, నాగంపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు, ఖండ్గాం సర్పంచ్ లాలయ్య, ఉంసా సొసైటీ చైర్మన్ రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.