కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కామారెడ్డిలోని ఈవీఎం గోదాంను బుధవారం నోడల్ అధికారులు పాండిచ్చేరి డిప్యూటీ సీఈఓ బి. తిల్ల ఈవెల్ , తమిళనాడు డిప్యూటీ సీఈవో వి. శ్రీధర్ పరిశీలించారు. సీసీ కెమెరాలను పనితీరును చూశారు.
రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా ఎన్నికల విభాగం పరిశీలకుడు సాయి భుజంగరావు, డిప్యూటీ తాసిల్దార్ ఇంద్ర ప్రియదర్శిని, అధికారులు పాల్గొన్నారు.