కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తక్షణమే పన్నులు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ వాణి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా విధించడంతోపాటు అక్కడికక్కడే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. తక్షణమే పన్నులు చెల్లించని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.
త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే 200 శాతం జరిమానా (పెనాల్టీ) మరియు కట్టాల్సిన టాక్స్ కలిపి మొత్తం 300 శాతం కట్టవలసి ఉంటుంది కావున వాహనదారులు ముందుగానే తమ తమ వాహన త్రైమాసిక పన్ను చెల్లించి భారీ జరిమానా నుంచి మినహాయింపు పొందగలరని సూచించారు.
మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ రాష్ట్రస్థాయి రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డాక్టర్. ఎన్. వాణి మాట్లాడారు ఈ వార్షికాంతానికి ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్స్ కె. శ్రీనివాస్ రెడ్డి, యు సుభాష్, వి.లక్ష్మణ్, జి మోహన్ మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్స్ పాల్గొన్నారు.