కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం యాచారం (4 గ్రామం పంచాయతీలు) గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తనూరు, శ్రీజ హాస్పిటల్ గాంధారి వారి సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
గ్రామంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు జీవన్ నాయక్, మసూద్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటింటికి ఆరోగ్యం అనే నినాదంతో యాచారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య శిబిరం హెల్త్ సూపర్వైజర్ నయీం, భాగ్యశ్రి, రజిత, శ్రీజ హాస్పిటల్ వైద్యులు హజి నాయక్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచులు లత రమేష్, సురేందర్, బలరాం, మోహన్, ఎంపీటీసీ సవిత సంగ్యా, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు శంకర్ నాయక్, ఆశ వర్కర్లు రేణుక, సునీత, మంజీర కళాశాల సోషల్ వర్క్ విద్యార్థులు, ఎన్జీవో వాలంటీర్స్ భోజేందర్, సంతోష్ రెడ్డి, లత, నవత, వినయ్, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.