కామరెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత, ఆర్ధిక సామాజిక రంగాల్లో అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా సంక్షేమ ఆధికారి పి .రమ్య పేర్కొన్నారు.
మార్చి 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సామాజిక, ఆర్ధిక సాధికారత రంగాల్లో అసాధారణమైన పరిస్థితులలో అత్యుతమంగా పని చేసిన మహిళా సాధకులకు ఆవార్డు అందజేయనున్నట్లు తెలిపారు.
అర్హత, ఆసక్తి కలిగిన మహిళలు తమ దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం రూమ్ నెంబర్ 31, జిల్లా కార్యాలయంలో ఫిబ్రవరి 20లోగా సమర్పించాలని జిల్లా సంక్షేమాదికారి పి.రమ్య తెలిపారు.